Vijay Devarakonda Birthday Special రాబోయే సినిమాలు

4 Min Read
vijay devarakonda birthday upcoming movies announcements

విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా తన రాబోయే సినిమాల గురించి ఆసక్తి కరమైన పోస్టర్లను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. 

మొదటి పోస్టర్ లో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు – శిరీష్ నిర్మాతలుగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ హీరోగా SVC 59వ చిత్రంగా ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో నిర్మించ బడుతుంది. ఈ బ్యానర్ లో హీరో విజయ్ రెండవ సారి నటిస్తున్నారు. పోస్టర్ లో “కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..” అనే ట్యాగ్ లైన్, క్రోధంతో వున్నా రక్తంతో తడిసిన  పిడికిలిలో సగం విరిగిన కత్తిని  పట్టుకున్న చేతితో నిప్పులు చెరుగుతున్నా మంటల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఆక్షన్ డ్రామ కథగా తెలుస్తుంది. ఈ బ్యానర్ లో విజయ్ హీరోగా మొదటి సినిమా “ఫ్యామిలీ స్టార్” ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోయిన కుటుంబ విలువలతో కూడిన కథ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రెండవ పోస్టర్ లో మైత్రి మూవీ మేకర్స్ వారి నవీన్  యెర్నేని – వై రవిశంకర్ నిర్మాణంలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తన 14వ చిత్రం. 1854 నుండి 1878  మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా చరిత్రని గురించి కథగా తెలుస్తుంది. పోస్టర్ లో ఒక రాతి పై చెక్కబడిన గుర్రం పై కూర్చొన్న యుద్ధ వీరుని శిలా విగ్రహం మరియు  ” శపించబడిన భూమి యొక్క పురాణం ” (the legend of the cursed land) ట్యాగ్ లైన్ తో చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో నిర్మించబడుతున్న చిత్రం. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ విజయ్ హీరోగా ” టాక్సీవాలా ” కామెడీ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకొని హిట్టుగా నిలిచింది. డైరెక్టర్, హీరో వీరి కలయికలో వస్తున్నా రెండవ సినిమా vd14.

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నాగవంశి ఎస్ – సాయి సౌజన్య నిర్మాతలుగా గౌతమ్ నాయుడు తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా vd12 భారి బడ్జెట్ స్పై ఆక్షన్ సినిమా షూటింగ్ దశలో వుంది. ఈ సినిమా అప్డేట్ కోసం హీరో విజయ్ అభిమానులు (Rowdy Fans) ఎంతగానో ఎదురుచూడగా చిత్ర బృందం అభిమానులను కాస్త నిరాశ పరిచిన కానీ అభిమానుల ఊరట కోసం డైరెక్టర్ తన సోషల్ మీడియా ఎక్స్ లో ఒక నోట్ ని విడుదల చేసారు. ఆ నోట్ ని హీరో విజయ్ కూడా తన సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేసారు. ఆ నోట్ లో  డైరెక్టర్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. 

పుట్టినరోజు శుభాకాంక్షలు, విజయ్!

ఈ రోజు మరియు ఎల్లప్పుడూ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మరో అద్భుతమైన సంవత్సరం ముందుకు ఉంది!

మా రౌడీ అభిమానులందరికీ మరియు అద్భుతమైన తెలుగు ప్రేక్షకులకు, మేము నిజంగా అసాధారణమైనదాన్ని రూపొందించినందుకు మీ సహనానికి నిజంగా అభినందనలు. నిరీక్షణ కొంచెం ఎక్కువ అయినప్పటికీ, మేము ఉత్తమమైన వాటిని మాత్రమే అందించడానికి కట్టుబడి ఉన్నాము.

ప్రస్తుతం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నాం.

పాల్గొన్న మనందరికీ ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అతి త్వరలో మీ అందరితో స్నీక్ పీక్ పంచుకోవడానికి మేము వేచి ఉండలేము!

– S. Naga Vamsi, Gowtam Tinnanuri

Team #VD12

 #HBDVijayDeverakonda

ఈ ముగ్గురి దర్శకులకు విజయ్ హీరోగా ఇరువురికి ఒకేసారి మూడవ సినిమా కావడం విశేషం.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో విజయ్ హీరోగా JGM సినిమా అనౌన్స్మెంట్ చాలా రోజుల క్రితం  చేసారు కాగా ఆ సినిమా అప్డేట్స్  తెలియాల్సింది వుంది. 

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version