Megastar చిరంజీవి “పద్మ విభూషణ్”

2daytimes
4 Min Read
padmavibhushanchiranjeevi

తెలుగు చిత్ర అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి గారికి దేశంలో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్ అవార్డు..

గౌ|| రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా తెలుగు చిత్ర అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు దేశంలో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగిన పద్మ అవార్డుల అందజేత కార్యక్రమంలో అందుకున్నారు. 

సినీ ప్రపంచంలో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నా మన మెగాస్టార్ సినీ పరిశ్రమకు మరియు అతీతంగా ఆయన చేసిన సేవలను గుర్తించి దేశంలో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించిన్నప్పటి నుండి దేశ నలుమూలల నుండి తమ అభిమాన నటుడికి సెలెబ్రేటిస్ నుండి అభిమానుల వరకు విషెస్ తెలిపారు.

కేంద్ర రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల అందజేత..

కేంద్ర రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల అందజేత కార్యక్రమంలో గౌ|| రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి గారు “పద్మ విభూషణ్ అవార్డు” అందుకున్నా రు. ఈ కార్యక్రమానికి చిరు సతీమణి సురేఖ, కూతురు సుష్మిత, దంపతులు రామ్ చరణ్ – ఉపాసన తో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుండి చిరంజీవి గారు “పద్మ భూషణ్” అవార్డు కూడా పొందారు.

చిరంజీవితో పాటు ప్రముఖ సీనియర్ నటీ, క్లాసిక్ డాన్సర్, సింగర్, పొలిటీషియన్ వైజయంతిమాల రామన్, రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.మొత్తం 132 “పద్మ” అవార్డులు, 5 పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. తేదీ 22 ఏప్రిల్ రోజున మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురికి అవార్డులు అందజేశారు రాష్ట్రపతి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాటు పలు ముఖ్య అతిథులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీ కొణిదెల చిరంజీవికి కళారంగంలో పద్మవిభూషణ్ బహుకరించారు. తన సినిమాల ద్వారా, మానవతా సేవల ద్వారా ప్రజల జీవితాలను స్పృశించిన ప్రముఖ నటుడు. శ్రీ చిరంజీవి పార్లమెంటు సభ్యునిగా మరియు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అతను మార్గదర్శక ప్రయత్నాలను కూడా చేసాడు మరియు అనేక సామాజిక కారణాల కోసం విస్తృతంగా పనిచేశాడు.

మెగా స్టార్ చిరంజీవి గారు అవార్డు పొందిన సంతోషంలో సోషల్ మీడియా ద్వారా తన పోస్టులో చిత్ర పరిశ్రమకు, ఆయనకు ఎల్లప్పుడూ అండగ వున్నవారికి, ఆయన్ను ప్రేమించి అభిమానించే వారికీ, కేంద్ర ప్రభుత్వానికి మరియు అభినందించిన వారికీ నమస్సుమాంజలి తెలిపారు.

రామ్ చరణ్ తన తండ్రికి దక్కిన ఈ అరుదైన గౌరవానికి ఆనందంతో సోషల్ మీడియాలో కంగ్రాట్యులేషన్స్ డాడ్. సో ప్రౌడ్ అఫ్ యు అని తెలిపారు.

ఉపాసన గారు కార్యక్రమానికి ముందు ఫోటో షూట్ స్టూడియోలో రామ్ చరణ్ గారితో పాటు చిరంజీవి గారిని కొన్ని ప్రశ్నలు, మీ అనుభూతి గురించి చెప్పండి అని అడిగారు దానికి చిరంజీవి గారు ఉపాసన లాంటి మంచి కోడలు నాకు క్లిన్ కారాని ఇచ్చిన తరువాత బిగ్గెస్ట్ అవార్డు అని చెప్పారు. ఇంకో ప్రశ్న అడిగేలోపు ఉపాసన వీడియో తీస్తున్న ఫోన్ ని చిరంజీవి గారు తీసుకొని టెల్ మీ అమ్మ అని అడిగారు ఉపాసన ఓకే మామయ్య వాట్ ఇస్ కామన్ బిట్వీన్ మీ అండ్ క్లిన్ కారా అని ఓకే అని ప్రశ్న అడిగారు దానికి చిరంజీవి గారు క్లిన్ కారా ఏక్స్ టెన్షన్ అఫ్ యూర్స్ అని చెప్పగా ఉపాసన నో మామయ్య బోథ్ ఆర్ గ్రాండ్ ఫాథర్స్ ఆర్ పద్మ భూషణ్ అని చెప్పగా చిరంజీవి గారు నవ్వుతూ ఓకే యూ ఆర్ రైట్ pc రెడ్డి గారు అండ్ ఐ నవ్వుతూ కెమెరా రామ్ చరణ్ వైపు తిప్పారు రామ్ చరణ్ గారు హాయ్ అని గ్రీటింగ్స్ తెలిపారు.

Share this Article
Leave a comment